రాష్ట్రంలో రావణ రాజ్యం అంతమైంది : రాజాసింగ్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద బీజేపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అన్ని వర్గాల వారు స్మరించుకుంటున్నారు. రాష్ట్రంలో రావణ రాజ్యం అంతమైంది. దళితులను కేసీఆర్ మోసం చేశారు. బీజేపీ ఒత్తిడితోనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను ఎప్పుడూ గౌరవించలేదు. ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలను కాంగ్రెస్ వచ్చింది అని అన్నారు.













