బీజేఎల్పీ నేతగా రాజాసింగ్ ?
భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేత (బీజేఎల్పీ) నేతగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ నియమితులయ్యే అవకాశాలున్నాయి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకే ఈ అవకాశం లభించనుందని పార్టీ వర్గాల సమాచారం. రెండుసార్లు గెలుపొందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ ఉప నాయకుడిగా నియమించవచ్చునని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి మొత్తం 8 మంది గెలవగా, వారిలో ఈ ఇద్దరు మినహా మిగతా వారంతా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వారే. కొత్త ఎమ్మెల్యేలను పార్టీ విప్లు, ఇతర పదవుల్లో నియమించనున్నట్టు సమాచారం.













