రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు రాహుల్ వెంట ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి యాత్రను రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించారు.













