విద్యార్థుల ఆహ్వానం మేరకే ఓయూ పర్యటన
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓయూ విద్యార్థి సంఘాలు ఆహ్వానించాయని, వారి ఆహ్వానం మేరకే రాహుల్ పర్యటించనున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. విద్యార్థులు అడ్డుకోవాల్సింది రాహుల్‌ని కాదని, కేసీఆర్‌ను నిలదీయాలని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. వీసీ అనుమతి తరువాతే రాహుల్ పర్యటనపై చర్చ ఉంటుందని తెలిపారు.













