మెదక్ నుంచి రాహుల్ గాంధీ పోటీ?
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెదక్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నిలబడిన ఈ స్థానం నుంచే ఆయనను పోటీ చేయించాలని వారు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి సభ విజయవంతం కావడం, గతంలోని సెంటిమెంట్‌ను గుర్తుకు తెస్తూ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు కొంతమంది ఈ ప్రతి పాదనలను రాహుల్ ముందు ఉంచారు. దీనిపై రాహుల్ సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్లుగా తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్‌ను లోక్‌సభకు పోటీ చేయించాలన్న దాని పై కొద్ది రోజులగా ఢిల్లీ పెద్దలు చర్చిస్తున్నారని పార్టీ సినీయర్ నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో పిసిసిలోని సీనియర్ నాయకుల అభిప్రాయలను కూడా తెలుసుకున్నారన్నారు. ఢిల్లీలో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఈ అంశంపై చర్చించినట్లుగా తెలిసింది.













