తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన…
ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17న వరంగల్ దళిత గిరిజన సభ జరుగనుంది. వరంగల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి తెలంగాణ పీసీసీ ప్లాన్ చేస్తోంది. వరంగల్ సెంటిమెంట్‌ను కాంగ్రెస్ నమ్ముతోంది. 2004 ఎన్నికల ముందు బీసీ గర్జన సభను వరంగల్‌లో నిర్వహించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దళిత గిరిజన ముగింపు సభకు రాహుల్ గాంధీ హజరు కానున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంను బీజేపీ నిర్వహించే రోజే, దళిత గిరిజన ముగింపు సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.













