రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, రేణుకాచౌదరి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో సంగారెడ్డికి ర్యాలీగా బయలుదేరారు. సంగారెడ్డిలో జరిగే ప్రజాగర్జన సభలో రాహుల్ పాల్గొనున్నారు. మార్గ మధ్యలో సోమాజిగూడ సర్కిల్లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాహుల్‌గాంధీకి స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.













