కాంగ్రెస్ పార్టీతోనే తన వివాహం
కాంగ్రెస్ పార్టీతోనే తన వివాహం జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ హరితప్లాజాలో పత్రికా సంపాదకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని రాహుల్‌ను పత్రికా సంపాదకులు ప్రశ్నించగా, కాంగ్రెస్‌తోనే తనకు వివాహం అయిపోయిందని ఆయన సమాధానం ఇచ్చారు. ఇక 2019లో నరేంద్ర మోదీ ప్రధాని కావడం కష్టమని అన్నారు. 230 లోక్‌సభ స్థానాలను బీజీపీ గెలుచుకోవడం కష్టమన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంటుందని రాహుల్ సృష్టం చేశారు.













