ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్ గాంధీ
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోది హామీ నెరవేరుస్తాం అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో ఏర్పాటైన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలోని బీదర్ ‘జనధ్వని’ ర్యాలీలోనూ కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు కేంద్రం కొన్ని హామీలనిచ్చింది. తెలంగాణకు రావాల్సిన హక్కులు ఈ రోజుకూ ఢిల్లీ నుంచి ఎందుకు రాలేదు? పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే నేతలు హామీలు ఎందుకు పూర్తి చేయరు? అని ప్రశ్నించారు. దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ పరిపాలనలో, ప్రజలను మోసగించడంలో ఒకేలా ముందుకెళుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కుటుంబపాలన, అవినీతి కొనసాగుతోందని విమర్శించారు.













