రాచకొండ సీపీ కి మరో అరుదైన గౌరవం
రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ మానవ అక్రమ రవాణా బానిసత్వ నిర్మూలన జాబితాలో ఆయనకు చోటు లభించింది. కెనడాకు చెందిన ప్రముఖ సంస్థ అసెంట్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రో డేమ్ సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో మహేశ్ భగవత్‌కు 47వ స్థానం దక్కింది. మానవ అక్రమ రవాణా, బానిసత్వ నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసిన వ్యక్తులను గుర్తించి అసెంట్ కంపెనీ ఏటా ఈ జాబితాను ప్రకటిస్తోంది. 2017 సంవత్సరానికి గాను 100 మంది ప్రముఖు జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో మొదటిస్థానాన్ని అడిడాస్ గ్రూప్‌నకు చెందిన అదితి వాంచో సంపాదించారు. భారత్‌కు చెందిన జర్నలిస్ట్ రుచిర గుప్తా 5వ స్థానంలో నిలిచారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ 47వ స్థానం సంపాదించారు. ఆయన 13 ఏళ్లుగా మనుషుల అక్రమ రవాణాను నివారించడానికి పోరాడుతున్నారని అసెంట్ ప్రశంసించింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్‌పర్సన్ రిపోర్టు ఇన్ పర్సన్ 2017 అవార్డుతో ఆయనను సత్కరించింది. బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాలోనూ ఆయన ఇటీవల చోటు సంపాదించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతా. తెలంగాణలో మానవ అక్రమ రవాణా నిర్మూలనకు పాటుపడుతా అని సీపీ తెలిపారు.













