గాంధీభవన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు
రాష్ట్రానికి, దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ కొనియాడింది. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీవీపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తదితరులు పీవీ సేవలను కొనియాడుతూ, వీడియో ద్వారా సందేశమిచ్చారు. పీవీ ఎన్నటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ నాకు వ్యక్తిగతంగానూ పరిచయం. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో భూ సంస్కరణలు తీసుకొచ్చి, లక్షల మందికి న్యాయం చేశారు. ఆయన జీవితాంతం కాంగ్రెస్ వాది అని ఉత్తమ్ అన్నారు.













