Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Pv narasimha rao 100th jayanthi celebrations in new zealand

పీవీ అంటే కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం

  • Published By: cvramsushanth
  • June 20, 2021 / 10:03 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Pv Narasimha Rao 100th Jayanthi Celebrations In New Zealand

– ఏడాది పాటు ఉత్సవాల నిర్వహణ గొప్ప విషయం
– సమయపాలన, నిరంతర అధ్యయనంతో పీవీ విజయం
– అక్షరంతోనే అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానం
– పీవీ జీవితం ఈ తరానికి స్ఫూర్తిదాయకం
– న్యూజీలాండ్ లో పీవీ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో సురభివాణీదేవి
– పీవీకి భారతరత్న సాధించేందుకు కృషి చేస్తాం: మహేశ్ బిగాల
– భూసంస్కరణలపై పీవీ తర్వాత కేసీఆర్ దే ఘనత: న్యూజీలాండ్ ప్రతినిధులు

Telugu Times Custom Ads

ప్రజల పట్ల ప్రేమతో అంకితభావంతో పని చేసిన స్ఫూర్తిప్రదాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యురాలు, పీవీ కుమార్తె సురభి వాణీదేవి అన్నారు. పీవీ ఖ్యాతి ఈ తరానికి చాటిచెప్పాల్సిన అవసరముందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో పీవీ శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. న్యూజీలాండ్ లోని మోటార్ కేడ్ లో పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో సురభి వాణీదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. పీవీ ఉత్సవాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. పీవీ అంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం అని… అందుకే ఏడాది పాటు స్మరించుకునేలా ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. దేశవిదేశాల ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. పీవీ జీవితమే మార్గదర్శకత్వం అని అన్నారు. ఉపాధ్యాయురాలిగా ఎంతో మందిని చూసినప్పటికీ… పీవీ లాంటి వ్యక్తిత్వాన్ని చూడలేదని కొనియాడారు. పీవీ నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకునే వారని, రాజకీయనేతగా, ప్రధానిగా తన పదవికి పరిమితం కాకుండా… ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగి ఉండేవారని తెలిపారు. వివిధ రంగాల్లో ఎంతో ప్రతిభ కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని వివరించారు. విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నా… ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం, అవతలి వ్యక్తి దృక్పథం తెలుసుకోవడం, నేర్చుకోవడం పీవీ గొప్ప గుణమని వాణీదేవి అన్నారు. మితాహారం, మితభాషణం, సమయ పాలన, జ్ఞాపకశక్తి పీవీ విశేష లక్షణాలు అని తెలిపారు. ఒక వ్యక్తిని 30 ఏళ్ల తర్వాత గుంపులో చూసినా… పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి పీవీ సొంతమని చెప్పారు. సమయపాలనకు పీవీ నిదర్శనమని, వేకువజామునే 4 గంటలకు నిద్ర లేచే వారని తెలిపారు. పుస్తక పఠనం, అధ్యయనం మాత్రమే ఆయనను ఉన్నతస్థానాలకు తీసుకెళ్లాయని అన్నారు. పీవీ చదువును, అక్షరాన్ని నమ్ముకున్నారు కాబట్టే ఆయన ఖ్యాతి క్షరం కాకుండా స్థిరస్థాయిగా నిలిచి ఉందని తెలిపారు. పీవీకి ఏ పదవి అయినా అందరి ఏకాభిప్రాయంతోనే వచ్చినవేనని చెప్పారు. సన్యాసం స్వీకరిద్దామని సిద్ధపడ్డ తరుణంలో ప్రధాని పదవి రావడంతో… ప్రజలకు ఏదో చేయాల్సి ఉందన్న నిష్టతో పని చేసిన ధార్మికుడు పీవీ అని గుర్తుచేశారు. అద్భుతమైన పాలనతో నవభారత ఆర్థిక సంస్కర్తగా, స్థితప్రజ్ఞగా పీవీ నరసింహారావు ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.

– పీవీ నిరంతర సంస్కరణశీలి: మహేశ్ బిగాల

ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కన్వీనర్, శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహారావు ఒక వ్యక్తి కాదని… అలాంటి మహనీయుడిని స్మరించుకోవడానికి ఏడాది కూడా సరిపోదని అన్నారు. పీవీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని కొనియాడారు. పీవీ సంస్కరణల కారణంగానే ఎంతో మంది విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండేందుకు అవకాశం లభించిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, కెనడా, జర్మనీ, కువైట్, డెన్మార్క్ సహా… 50కి  పైగా దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పీవీ ఖ్యాతిని చాటేందుకు శత జయంతి ఉత్సవాల తర్వాత కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత దేశ ఆధునిక చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ కీర్తి గడించారని తెలిపారు. ఏ రంగంలో బాధ్యతలు అప్పగించినా సంస్కరణలు చేపట్టిన ఘనత పీవీ సొంతమని వివరించారు. కేవలం అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించడం కాకుండా… ఆయా రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం పీవీ ప్రత్యేకత అని తెలిపారు. ప్రధానిగా ఉన్నప్పుడు విపక్షాలకు సముచిత గౌరవం ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు. ఆనాడు పీవీ తీసుకువచ్చిన భూ సంస్కరణల తర్వాత… భూముల విషయం గురించి మళ్లీ ఆలోచించింది… కేసీఆర్ మాత్రమే అని కొనియాడారు. పీవీకి భారతరత్న వచ్చేలా ప్రభుత్వంతో పాటు… పౌర సమాజం కూడా గళమెత్తాలని సూచించారు.

– పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలి: న్యూజీలాండ్ ప్రతినిధులు

పీవీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా న్యూజీలాండ్ ప్రతినిధులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వివిధ సంఘాల ప్రతినిధులు… పీవీ ఖ్యాతిని, అనుబంధాన్ని స్మరించుకున్నారు. పీవీ మన కాలం చాణక్యుడు అని అన్నారు. విద్యార్థిగా నిజాం వ్యతిరేక పోరాటం పాల్గొనడం నుంచి ప్రధాని స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారని స్మరించుకున్నారు. పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టారని, నాటి సంస్కరణలే నేడు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 360 కోణాల వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి తెలుసుకుని… ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఉత్సవాల ద్వారా పీవీ గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు. పీవీ జీవితం వ్యక్తిత్వ వికాస గ్రంథమని, ఆయన మాటలు స్ఫూర్తి మంత్రాలని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు కాలమే సమాధానం చెబుతుందని… అందుకోసం ఎదురుచూడాలని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని, కొన్నిసార్లు నిర్ణయం తీసుకోకపోవడమే నిర్ణయం అంటూ.. ఇలా  పీవీ ఇచ్చిన ఎన్నో సందేశాలు ఆలోచనాత్మకంగా ఉంటాయని కొనియాడారు. ప్రగతిశీల ఆలోచన విధానం కలిగిన రాజనీతిజ్ఞుడు పీవీ గురించి నేటి తరానికి పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరముందని తెలిపారు. కార్యక్రమంలో న్యూజీలాండ్ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒడ్నాల జగన్ మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డితో ARUN PRAKASH REDDY, RAMA RAO Rachakonda, Vijay Kosna, and Kalyan Kasuganti and Narender Reddy patlola పాటు పలువురు పాల్గొన్నారు.

And Prasanna, Dharmender and Neerav Singh who organised the program.

 

Tags
  • 100th Jayanthi
  • Celebrations
  • New Zealand
  • pv narasimha rao
  • Surabhi Vani

Related News

  • We Have Not Changed Parties Says Brs Mlas

    BRS: బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?

  • Cm Revanth Reddy Key Instructions On Godavari Pushkaralu

    Revanth Reddy: గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

  • Ktr Has Been Chosen For The Green Leadership Award 2025

    KTR: కేటీఆర్‌కు గ్రీన్‌ లీడర్‌షిప్‌ అవార్డు

  • Brs Focus On Jubilee Hills By Election

    BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

  • Mou Signed Between Iacg India And Kyoto Seika University Japan At T Hub In The Presence Of Vc The Young India Skill University And Others

    భారతదేశంలోని IACG – జపాన్‌లోని Kyoto Seika యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం (MoU)

  • Cm Revanth Reddy Review On Railway Projects

    Revanth Reddy: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Latest News
  • ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
  • Minister Narayana: ప్రజలెవరూ వదంతులు  నమ్మొద్దు : మంత్రి నారాయణ
  • Ayesha Meera: సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయింది
  • Minister Satya Prasad: వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడిస్తారు : మంత్రి అనగాని
  • TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్‌
  • YS Sharmila: విశాఖ ఉక్కు సమావేశం లో ఓ ఆసక్తికర దృశ్యం
  • United Nations : ఐరాస చేసిన తీర్మానానికి భారత్‌ మద్దతు
  • AI Minister: ప్రపంచంలోనే తొలిసారి ….  ఏఐ మంత్రి
  • NATS Volleyball Tournament on Sept 27
  • Donald Trump: భారత్‌పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer