భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి
భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరిగే భద్రాద్రి కల్యాణం కోసం ఆన్లైన్లో విక్రయించిన టికెట్లను రద్దు చేస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులకు టికెట్ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేవలం ఆలయ ప్రాంగణంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. భద్రాద్రి కల్యాణం కోసం ఆన్లైన్లో విక్రయించిన టికెట్లను రద్దు చేస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులకు టికెట్ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేవలం ఆలయ ప్రాంగణంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.













