దమ్ముంటే తాను ఖమ్మంలో ఉన్నప్పుడే వస్తే.. వారికి
కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ముస్తఫానగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీ-ఫారం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే, ఖమ్మంలో కొందరు బందిపోటు దొంగలు చొరబడ్డారని అన్నారు. దమ్ముంటే తాను ఖమ్మంలో ఉన్నప్పుడు వస్తే, వారికి సినిమా చూపించేవాణ్నని మండిపడ్డారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి పువ్వాడ తాజా వ్యాఖ్యలు చేశారు.













