ఆ ప్రాజెక్టు తోనే భద్రాచలానికి ముప్పు : మంత్రి పువ్వాడ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని, ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మత్రి పువ్వాడ అజయ్ అన్నారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం ముంపు ప్రాంతానాకి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విలీనమైన 7 మండలాలు, భద్రచాలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. పోలవరం ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు.













