రాజీనామా చేయనున్న కోదండరామ్
తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్ష పదవికి కోదండరామ్ రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా చేయనున్నట్లు కోదండరామ్ తెలిపారు. రేపు సరూర్‌నగర్ మైదానాంలో తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో రాజకీయ ఐకాస ఏర్పడింది. పలు రాజకీయ పార్టీలు భాగస్వామంగా ఉన్న ఈ ఐకాస కోదండరామ్ నేతృత్వంలో రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది.













