పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోదండరాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ కోదండరాం పోటీపై క్లారిటీ వచ్చింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పోటీకి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను కార్యక్తలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రజల తరపున పోరాడుతున్నామని, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన జరుగుతోందని, ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కోదండరాం పోటీపై సృస్టత వచ్చినప్పటికీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల ఎన్నికలను నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలుస్తుందనే వార్తలు వెలువడ్డాయి.













