దించటానికే వచ్చినం… దిగిపొమ్మని హెచ్చరిస్తున్నాం
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పాలనపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నిప్పులు చెరిగారు. కేసీఆర్ను నేరుగా టార్గెట్ చేశారు. దించటానికే బయలు దేరాం, దిగిపోవాలని హెచ్చరిస్తున్నాం. కోట్లాడి సాధించిన తెలంగాణలో నిరంకుశంగా పాలనసాగిస్తే సహించేది లేదని, పాలకుల పెత్తనాన్ని సాగనివ్వమని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో ఘర్షణ వాతావరణ నెలకుంది. ప్రజల ఆకాంక్షలు, నిరంకుశ పాలనకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది విద్యార్థి యువకులు ప్రాణాలు త్యాగం చేస్తేనే వచ్చింది తప్ప, ఏ ఒక్కరి వల్లో కాదని పరోక్షంగా కేసీఆర్ వల్ల కాదని ఆయన ప్రస్తావించారు.













