తెలంగాణ ఏర్పడింది కానీ.. అదీ నెరవేరలేదు : ప్రియాంక
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిరది. రూ.400 గ్యాస్ సిలిండర్ ధరను రూ.వెయ్యికి పైగా పెంచారు. తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటున్నాయి అని విమర్శించారు.













