హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కి.మీ మేర సాగిన ఈ రోడ్‌షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. మోదీ వెంట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.













