మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగింది. సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు మోదీకి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనం తర్వాత సంగారెడ్డి పర్యటనకు మోదీ బయల్దేరారు.