Charlapally Terminal: చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Terminal )ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మోదీ తెలిపారు. మెట్రో నెట్‌వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 28న ఈ టెర్నినల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.