హైదరాబాద్ వాసికి రాష్ట్రపతి ప్రశంస
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15ను పురస్కరించుకొని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న హైదరాబాద్ వాసి రాజయ్య యాదవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ ప్రత్యేక ప్రశంస పత్రాన్ని పంపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ కార్పోరేటర్లు శంకర్ యాదవ్, రాకేష్ జస్వాల్ ఓం ప్రకాష్ బిస్వాతో పాటు స్థానిక నాయకులు సుధీర్ యాదవ్‌లు రాజయ్యకు షాలువాతో సన్మానించి, రాష్ట్రపతి పంపిన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిచే ప్రశంసలు పొందిన రాజయ్య యాదవ్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో అసువులు భాషారని, మరెందరో వారి జీవితాలను త్యాగం చేశారని అన్నారు. నిరంతరం జరిగిన భారత స్వాతంత్య్ర పోరాటంలో తాను కూడా పాల్గొన్నానని అన్నారు. తనకు రాష్ట్రపతి ప్రశంసా ఉత్తరం పంపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













