తెలంగాణ గవర్నర్ కు రాష్ట్రపతి ఫోన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్లో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి తమిళిసైతో ఫోన్లో సంభాషించారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్ గురించి గవర్నర్ తమిళి సై ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి, వైఎస్ ఛాన్సులర్లు, పాల్గొంటారు. కాగా జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్ నిర్వహించిన విషయం విదితమే.













