ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర : అశోక్ గౌడ్
మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర చాలా గొప్పదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టి ఆరు గ్యారంటీలు హాస్యాస్పదమని, ఏ గ్యారెంటీ వారంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 60 సంవత్సరాలు ప్రజలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరో సారి నమ్మితే రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్మే పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మూడోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వంద సీట్లతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.













