Draupadi Murmu: ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర : రాష్ట్రపతి
ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ (Ramoji Film City)లో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సుకు రాష్ట్రపతి (President) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాం. 1950 తర్వాత యూపీఎస్సీ (UPSC), పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైంది. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. B.R. Ambedkar) కీలక పాత్ర పోషించారు. నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం అని అన్నారు.






