పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి : రాష్ట్రపతి
చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా రాష్ట్రపతి చేనేత మగ్గాలను, టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగించారు. చేనేత కళ విభిన్నమైంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయం. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. పోచంపల్లి చేనేత కార్మికులు ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటాను. పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అని అన్నారు.













