సిరిసిల్ల విద్యార్థికి రాష్ట్రపతి ప్రశంసలు
వరి ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తడానికి రైతులు పడుతున్న కష్టాన్ని గుర్తించి ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ రూపొందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి మర్రిపెల్లి అభిషేక్ రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్లో వరి ధాన్యం ఎత్తే యంత్రాన్ని అభిషేక్ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ యంత్రం ఉపయోగం గురించి అడిగి తెలుసుకున్నార. అనంతరం అభిషేక్‌ను అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేటకు చెందిన అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఇన్స్పైర్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయికి 60 ప్రదర్శనలు ఎంపిక కాగా, అందులో చోటు దక్కించుకుంది.













