మౌనంగా ఉంటే దేశానికి తగిలిన గాయాలు మానవు
మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ, దేశానికి తగిలిన గాయాలు రాచపుండు అవుతాయని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ను ప్రకాశ్‌రాజ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారు. ప్రస్తుత సమాజం సందిగ్ధతలో ఉంది. వంద రోజులుగా మణిపుర్ మండిపోతుంది. మణిపుర్ గురించి ప్రశ్నిస్తే హరియాణా, బెంగాల్ అని అనవసర విషయాలు ప్రస్తావించారు. గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.













