దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రి పొన్నం సవాల్

బీఆర్‌ఎస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండగా మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి, ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన మోసాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు.