రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్.. ఇప్పుడు దేశం వైపు
తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన సీఎం ఇప్పుడు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని అన్నారు. దేశానికి నాయకత్వం వహించేందుకు కేసీఆర్కు ఉన్న బలమెంత అని ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతున్న బంగారు భారత్ నివాదం హాస్యాస్పదంగా ఉందని చురకలు అంటించారు. కూట్లో రాయి తీయలేని వాడు, ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఆయన అనుకుంటున్న థర్డ్ ఫ్రంట్ ఓ భ్రమగానే మిగిలిపోతుందన్నారు. ఏమినిదేళ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ నక్కజిత్తుల మాటలకు కాలం చెల్లిందంటూ మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. సైకిల్ టెర్రరిస్ట్ అంటూ మోదీ మాట్లాడటం సరికాదన్నారు. చేతగాని అసమర్థులు దేశాన్ని పాలిస్తున్నారని అని అన్నారు.













