ఆ సమీక్ష తర్వాత సీఎం రేవంత్ తీపి కబురు : పొంగులేటి
కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని విమర్శించారు. హుజూర్నగర్లో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టామన్నారు. హుజూర్నగర్లో 2,160 ఇళ్లు పూర్తి చేసి, రాబోయే 3,4 నెలల్లో అర్హులైన పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇరిగేషన్ పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని తెలిపారు.













