మాజీ మేయర్ తీగలకు జరిమానా

హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డికి సరూర్‍నగర్ పోలీసులు చలాను విధించారు. కారులో మాస్క్ లేకుండా వెళుతున్న తీగల కృష్ణారెడ్డికి పోలీసులు 1000 రూపాయల చలాను వేశారు. కర్మన్‍ఘాట్ చౌరస్తా వద్ద సరూర్‍నగర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో వెళ్తున్నారు. పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సబ్ ఇన్‍స్పెక్టర్ ముకేష్ తీగలను ప్రశ్నించారు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా? అంటూ ఆయన ఎస్‍ఐతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్‍ఇన్‍స్పెక్టర్ ముకేశ్‍కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు.