తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ శాసనసభ సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ చైర్లో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్ కోరారు. నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రొటెం స్పీకర్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటల రాజేందర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను స్పీకర్ కూర్చీ వరకు తొడ్కొని వెళ్లారు. దీంతో స్పీకర్ గా పోచారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.













