తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. మొత్తం ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్, మల్లు భట్టి విక్రమార్కతో పాటు అహ్మద్ బలాల, రేఖా నాయక్, అబ్రహం, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో ఎంఐఎం, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ స్పీకర్ ఏకగ్రీవానికి ఆమోదం తెలిపాయి. దీంతో స్పీకర్ ఎన్నిక ఇక లాంఛనమే. సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.













