తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్ కు బ్రేక్
తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన మదుసూదన చారి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదేండ్ల మనోహర్, సురేష్ రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఓడిపోయారు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తిరగరాశారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అబ్యర్థిపై 23582 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత తెలంగాణ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి పోటీ చేసిన అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సెంటిమెంట్‌కు భయపడే గత స్పీకర్ మధుసూధనాచారి తన నియోజకరవ్గంలో నిత్యం క్యాడర్‌తో ఉంటూ విపరీతంగా పర్యటించినా కూడా ఫలితం దక్కలేదు.













