వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వంం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ పెక్ప్రెస్ ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా జెండా ఊపీ ప్రారంభించారు. దీంతో దేశంలో ఎనిమిది వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చినట్లుయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏండు హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. కాగా, దక్షిణ మధ్య రైల్వేలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ రైలుగా చరిత్రలో నిలిచింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 10వ నంబర్ ప్లాట్ ఫారంపై జరిగిన ప్రారంభ వేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్విన్ వైశ్ణన్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసానీ శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













