ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టుల పై తెలంగాణ సీఎస్ తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ రైల్వే ప్రాజెక్టులు , హైవే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు మరియు ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజనలో సాధించిన పురోగతిని సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం NH-161 లోని సంగారెడ్డి – అకోలా – నాందేడ్ సెక్షన్ యొక్క నాలుగు లేనింగ్ విషయంలో సాధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. భూసేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పురోగతి సాధించిందని కేంద్ర రవాణా కార్యదర్శి శ్రీ ఎ.గిరిధర్ తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, రవాణా, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ S.A.M. రిజ్వీ , ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ సంచాలకులు డా.ప్రీతి మీనా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.













