ఈ నెల 7న తెలంగాణకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తరువాత రాష్ట్రానికి ప్రధాని రానుండటం ఇదే తొలిసారి.













