తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27, డిసెంబరు 3 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. డిసెంబరు 3, 5 తేదీల్లో ప్రధానిని ఎన్నికల ప్రచారానికి రప్పించాలని తొలుత రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. అయితే, ఈ పర్యటనలో కొంత మార్పు చోటు చేసుకున్నట్లు తెలిసింది. తాజాగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 27నే రాష్ట్రానికి వస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటలకు వరంగల్ సభలో పాల్గొంటారు. తిరిగి డిసెంబరు 3న హైదరాబాద్లో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.













