తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కమలనాథలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువుకు కేంద్రమంత్రులు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ప్రచారపర్వంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 27న డిసెంబర్ 3న జరిగే బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. 27న నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. వచ్చే నెల 3న హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. రాష్ట్ర నాయకత్వం మాత్రం హైదరాబాద్ బహిరంగ సభతో పాటు ఏదో ఒక జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనాలని కోరుతున్నట్లు సమాచారం.













