మోదీ, ఇవాంక ప్రత్యేక భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ట్రెడెంట్ హోటల్ నుంచి సదస్సు వేదిక హెచ్ఐసీసీకి వచ్చిన ఇవాంకతో మొదట విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకొన్నారు. తర్వాత ప్రధాని మోదీ ఇవాంకతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, అమెరికాలో భారత రాయబారి నవదేశ్సింగ్శరణ్, భారత్‌లో అమెరికా అంబాసిడర్ జుస్టర్, రెండు దేశాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













