ఇక్రిశాట్ లోగో, పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించిన ప్రధాని
ఇక్రిశాట్ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యుస్ సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ప్రధాని మోదీ ఇక్రిశాట్ 50 వసంతాల లోగోతో పాటు పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. అంతుకుముందు ఇక్రిశాట్లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. మెట్ట పంటల పరిశోధనలను మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. మోదీ ఆసక్తిగా విన్నారు. స్వర్ణోత్సవాల్లో గవర్నర్ తమిళి సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













