బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ప్రధాని ప్రశంస

బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ మాధవీలతాజీ మీరు పాల్గొన్న ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. కీలక అంశాలను లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు. ఈ ఎపిసోడ్‌ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.