సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన మోదీ
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై జెండా ఊపీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని నేరుగా వందేభారత్ రైలు ఎక్కారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం చేర్యాల పెయింటింగ్‌ను రైల్వే శాఖ మంత్రి ప్రధానికి అందించారు.













