ముఖ్యమంత్రి కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ ట్విట్ చేశారు. అదే విధంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి, జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.













