హైదరాబాద్ లో మరోవైపున కూడా ఐటీ అభివృద్ధి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో లుక్ ఈస్ట్ పేరుతో ఐటీరంగ విస్తరణకు కొత్త కార్యాచరణను ప్రభుత్వం చేపట్టింది. హైదరాబాద్ మహానగరం నలువైపులా ఐటీ రంగాన్ని అభివృద్ధిపరిచే ప్రణాళికల్లో భాగంగా నగరం తూర్పు వైపున ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించే ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఉప్పల్, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్ సహా సమీప ప్రాంతాలను అభివద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నగరం నలువైపులా ఐటీ, పారిశ్రామికాభివద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రాంతాల్లోనూ ఐటీ రంగాన్ని అభివద్ధిపరిచేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేటీఆర్ ఐటీ రంగ ప్రముఖులతో దేశంలోనూ, విదేశంలోనూ చర్చలు జరుపుతున్నారు.













