తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలిసి పనిచేస్తాం… అమెరికా ఆబర్న్ విశ్వవిద్యాలయం
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తామని అమెరికాలోని ఆబర్న్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు. డీన్ జార్జ్ ఫ్లవ్స్, ఆచార్యులు, బాబ్ బోయిడ్, మురళీధనశేఖరన్, జానకీరామిరెడ్డి తదితరులు రాజేంద్రనగర్లోని వర్సిటీని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం పరిపాలన భవనంలో రిజిస్ట్రార్ వెంకటరమణ, అధికారులతో సమావేశమయ్యారు. తమ విశ్వవిద్యాలయం పరిధిలోని 12 కళాశాలల్లో వ్యవసాయం సహా 200 డిగ్రీ కోర్సుల అందిస్తున్నామని, 31 వేల మంది విద్యనభ్యసిస్తుండగా, అందులో 2 వేల మంది విదేశీయులని తెలిపారు. ఇక్కడి వర్సిటీ పనితీరు బాగుందని డిగ్రీ. పీజీ కోర్సుల బోధన, విద్యార్థులు, నిపుణుల పరస్పర మార్పిడి ద్వారా కలిసి పనిచేస్తామని తెలిపారు.













