Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరోసారి వారిని
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రివ్యూ కమిటీలో ఉన్న వారిని సిట్ మరోసారి విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ (Prabhakar Rao) ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రెటరీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మరోసారి ప్రశ్నించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ (Somesh Kumar), మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి నవీన్ చంద్‌కు సైతం నోటీసులు ఇచ్చి సిట్ విచారించింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఎదుట ప్రభాకర్‌రావును ఉంచి వివరాలడిగింది. రెండోసారి నవీన్ వద్దకు వెళ్లి ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి, అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ స్టేట్మెంట్ కూడా మరోసారి రికార్డు చేసిన సిట్ ఈ కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.






