సచివాలయ నిర్మాణానికి అనుమతులొచ్చాయ్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి అన్ని అనుమతులు లభించాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన సచివాలయ నిర్మాణానికి వీలుగా ఆ ప్రాంతాన్ని చదును చేస్తున్నాం. పాత భవనాల కూల్చివేతకు సంబంధించిన శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయింది.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా, కాలుష్య నియంత్రణ మండలి, అగ్ని ప్రమాద నియంత్రణ మండళ్ల నుంచి నిర్మాణానికి ప్రాథమిక అనుమతులు లభించాయి. అనుమతులు వచ్చినందున టెండర్లు పిలిచి సాధ్యమైనంత తొందరగా నిర్మాణ పనులు ప్రారంభిస్తాం అని ఆయన వివరించారు.













